రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ, హీరోగా నటించిన ‘కాంతారా చాప్టర్ 1: ది లెజెండ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఒక పక్క సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ సినిమా చూస్తూ, సోషల్ మీడియా వేదికగా రివ్యూ షేర్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో రష్మిక స్పందించలేదు. దీంతో మరోసారి ఆమెను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది.
Also Read:Shilpa Shetty : పోలీసుల ముందు విచారణకు హాజరైన స్టార్ హీరోయిన్
నిజానికి, రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘కిరిక్ పార్టీ’ సినిమాతోనే రష్మిక హీరోయిన్గా కన్నడ నాట ఎంట్రీ ఇచ్చి, తద్వారా తెలుగులో ‘చలో’ సినిమా అవకాశాన్ని సంపాదించింది. ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితోనే ముందు ఎంగేజ్మెంట్ చేసుకుని, తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన సినిమా, అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఆదరాభిమానాలు సంపాదిస్తుంటే, ఆమె మాత్రం మూలాలు మరచి ఇప్పటివరకు చూడకపోవడం, చూసినా స్పందించ లేదని కన్నడ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Also Read:Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు.. ఖాతాలో రూ.కోటి జమ
ఇదే విషయం మీద స్పందిస్తూ రిషబ్ అభిమానులు, కన్నడ భాషాభిమానులు ఆమె మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అందరూ సినిమా బాగుందని వేనోళ్ల పొగుడుతుంటే, రష్మికకు ఏం నొప్పి? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి, ‘కాంతారా’ రిలీజ్ అయినప్పుడు కూడా ఆమె సినిమా చూడలేదని అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చి సంచలనం రేపింది. అప్పట్లో కూడా ఆమెను కన్నడ భాషాభిమానులు, ఆమె తమ భాషలో సినిమాలు చేయక్కర్లేదని, దయచేసి తమ భాషను విడిచి వెళ్లిపోవాలని అన్నట్లు కామెంట్లు చేశారు. ఇప్పుడు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. రష్మిక ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూ, మరో పక్క ఇటీవల విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకొని హాట్ టాపిక్ అయింది.