Rashmika :చావా నుంచి థామా వరకు.. 2025 లో రష్మిక దుమ్ము రేపిన కలెక్షన్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు వినగానే ఇప్పుడు బాక్సాఫీస్ హిట్ గ్యారంటీగా మారిపోయింది. ఈ అందాల భామ 2025 లో తన సినిమాలతో అద్భుతమైన రికార్డులు సృష్టించింది. సంవత్సరం మొత్తం ఆమె నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల మార్క్ దాటడం ఒక పెద్ద ఘనతగా నిలిచింది. తాజాగా విడుదలైన “థామా” సినిమా కూడా ఆ లిస్టులో చేరి రష్మిక విజయపథాన్ని మరింత బలపరచింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ భారతదేశంలో ఘన విజయం సాధిస్తోంది. లెక్కల ప్రకారం, థామా ఇప్పటి వరకు ఇండియాలోనే రూ.119.65 కోట్లు వసూలు చేసింది.
Also Read : Ilaiyaraaja: 15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన చిన్నారులకు ఇళయరాజా గోల్డెన్ ఛాన్స్!
Also Read
2025 మొదట్లో రష్మిక విక్కీ కౌశల్ సరసన నటించిన “చావా”తో థియేటర్లలో దుమ్మురేపింది. ఈ సినిమా అంచనాలకు మించి సూపర్ హిట్గా నిలిచి రూ.800 కోట్లు పైగా వసూళ్లు సాధించింది. తర్వాత సల్మాన్ ఖాన్ తో చేసిన “సికందర్” కొంత మిశ్రమ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం రూ.200 కోట్ల మార్క్ దాటేసింది. దీని తర్వాత ధనుష్–నాగార్జున మల్టీ స్టారర్ “కుబేర”లో రష్మిక నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా కూడా రూ.130 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక ఇప్పుడు థామా కూడా రూ.100 కోట్ల క్లబ్లోకి చేరి రష్మిక విజయ జాబితాను మరింత పొడిగించింది.
ఇక గతంలో “యానిమల్” మరియు “పుష్ప 2” చిత్రాలతో భారీ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న రష్మిక, ఇప్పుడు వరుసగా ఆరు సినిమాలతో రూ.100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన రేర్ హీరోయిన్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఇంకా రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయట ఒకటి దక్షిణాది బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ, మరొకటి హాలీవుడ్ లెవల్ వెబ్ సిరీస్. ఈ వేగం చూస్తుంటే రష్మిక బాక్సాఫీస్ సామ్రాజ్యం ఇంకా కొన్ని ఏళ్ల పాటు కొనసాగడం ఖాయం అనిపిస్తుంది.
తాజావార్తలు
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. బాల్కనీలోని కుండీలోనే చెట్టు పెంచే ఈ టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!