చిరంజీవి కెరీర్ లో పెద్ద డిజాస్టర్ సినిమా అంటే ‘ఆచార్య’ అనే చెప్పాలి. కానీ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు మాత్రం భారీ హైప్ సొంతం చేసుకుంది. అందుకు కారణం దర్శకుడు కొరటాల శివ. అవును అప్పటి వరకు ప్లాప్ అంటూ లేని కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అందులోను ఈ మూవీలో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. అందుకే మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. అయితే ముందు పావుగంట అనుకున్న చరణ్ పాత్ర 45 నిమిషాలకు పెంచారు. దీంతో అతనికి హీరోయిన్‌ని కూడా అడ్ చేయల్సి వచ్చింది.
Also Read:Priyanka Mohan: ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల: ప్రియాంక మోహన్
ఇక ఆ హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారట అందులో రష్మిక పేరు కూడా ఉంది. కానీ అప్పటికే ఆమె ‘పుష్ప’ సినిమాలో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టుని వదులుకుంది. దీంతో చరణ్- రష్మిక మంచి కాంబో మిస్ అయ్యాం. ఇక తాజా సమాచారం ప్రకారం ఆ లోటుని టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తీర్చబోతున్నట్టు తెలుస్తుంది. అవును సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని చరణ్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్‌గా రష్మికని ఫైనల్ చేసేసినట్టు ఇన్సైడ్ టాక్. ప్రజంట్ ‘యానిమల్’, ‘పుష్ప’, ‘చావా’ వంటి భారీ హిట్స్ అందుకున్న రష్మిక నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఇక ఈ వార్త కనుక నిజం అయితే రష్మిక ఖాతాలో మరో హిట్ పడినట్లే.