ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Also Read : UnstoppableWithNBK : రెబల్ స్టార్ కు రామ్ చరణ్ ఫోన్.. ఎందుకంటే.?
‘మన సాగర్ గాడి లవ్వు .. మహా లక్ష్మి’ అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ ట్రెడిషనల్ లుక్కులో కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ లో దర్శనమిచ్చాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. ”హైదరాబాద్‌లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్ లా ఉంటుందట. ప్రేక్షకులు నోస్టాల్జియాలోకి వెళతారని, ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారని తెలుస్తోంది. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ్, భాగ్య శ్రీ జోడీ మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయని యూనిట్ టాక్. కాగా ఈ సినిమాకు వివేక్ – మెర్విన్ లు సంగీతం అందిస్తున్నారు.