అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటికి ఈ స్టేజ్ పై తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్ తారలు కూడా సందరడి చేసారు. ఇక లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ టాక్ షో కు అతిదిగా హాజరయ్యాడు. చరణ్ తో పాటు మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా స్టేజ్ పై సందడి చేసాడు. ఈ ఇద్దరి హీరోలతో పాటు టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు, శర్వానంద్ స్నేహితుడు విక్కీ కూడా పాల్గొన్నారు.
Also Read : GameChanger : గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్, టైమ్ లాక్
ఈ ఎపిసోడ్ షూటింగ్ ను ఈ మంగళవారం పూర్తి చేసారు అన్ స్టాపబుల్ మేకర్స్. అందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఎపిసోడ్ లో ఓ సన్నివేశం ఈ ఎపిసోడ్ కు హైలెట్ గా నిలిచిందట. రామ్ చరణ్ తన స్నేహితుడు రెబల్ స్టార్ ప్రభాస్ కు కాల్ చేసిన సన్నివేశం సూపర్ ఫన్ గా సాగిందట. గతంలో ప్రభాస్ అన్ స్టాపబుల్ కు వచ్చినప్పుడు రామ్ చరణ్ కు కాల్ చేయగా ప్రభాస్ కు గర్ల్ ఫ్రెండ్ ఉందని సరదాగా ఆటపట్టించాడు చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ ఈ షోకు విచ్చేయగా బాలయ్య, రెబల్ స్టార్ ప్రభాస్ కు కాల్ చేశారట. చరణ్ కాల్ చేయాగానే ‘ఒరేయ్ చరణ్’ అని ప్రభాస్ పిలిచిన పిలుపుతో షో మొత్తం అరుపులు, కేకలతో హోరెత్తిందట. ఈ సీజన్ మొత్తంలో ఈ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని భావిస్తోంది యూనిట్. అటు మెగా ఇటు రెబల్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.