టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తన కంటూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో విజయాలను అందుకోవడంతో చాలా వెనుకబడి పోయాడు. వరుసగా ‘ది వారియర్’, ‘స్కంద’ , ‘డబల్ ఇస్మార్ట్’ మూవీలు భారీ అపజయాలను అందుకున్నాయి. కొంచెం గ్యాప్ తీసుకున్న రామ్.. ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో, రామ్ సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ప్రేమకథా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా రామ్ పోతినేనికి ఓ కొత్త మేకోవర్‌గా ఉండబోతుందన్న ఫిలింనగర్ టాక్. ఇక పోతే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
Also Read : Prabhas : ‘స్పిరిట్’ కోసం దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!
ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ వీడియో ను మే 15న రామ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఈ చిత్రం గ్లింప్స్ ఇంకా టైటిల్‌లు ఈ మే 15 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రివీల్ చేశారు. మరి ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ ఏంటి అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.