Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor: ఆస్తి పంపకాలు, చిన్నపాటి మనస్పర్థలకే తోడబుట్టిన వాళ్లు కోర్టు మెట్లు ఎక్కుతున్న రోజులివి. అలాంటిది అన్న రాముడి కోసం రాజభోగాలను, సుఖాలను వదులుకుని పద్నాలుగేళ్ల పాటు అడవుల బాట పట్టిన లక్ష్మణుడి త్యాగం.. ఈ ఆధునిక కాలంలో సాధ్యమేనా? అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఎదురైన ఈ ప్రశ్నకు రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో నేటి లైఫ్‌స్టైల్, రిలేషన్స్ గురించిన చర్చ నడిచింది. “టెక్నాలజీలో మనం ఎంత ముందుకెళ్లినా, మనుషుల మధ్య మాత్రం ఆ బాండింగ్ మిస్సవుతోంది. అన్న కోసం అన్నీ వదులుకుని 14 ఏళ్లు అడవులకు వెళ్లిన లక్ష్మణుడి లాంటి తమ్ముడిని ఈ రోజుల్లో చూడగలమా?” అని హోస్ట్ అడిగారు.
దీనికి రణ్‌బీర్ కపూర్ అత్యంత ఆలోచింపజేసే రీతిలో స్పందించారు. “రామాయణంలో కనిపించే ప్రతి పాత్ర, బంధం నేటి సమాజానికి ఒక పర్ఫెక్ట్ మోడల్. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలో శ్రీరాముడు, లక్ష్మణుడి పాత్రలు చాటిచెప్పాయి. ఆ స్థాయిలో త్యాగం చేయగలగడం చరిత్రలో నమోదైందంటే.. ఆ మానవీయ విలువలు ఇప్పటికీ మనుషుల అంతరంగంలో ఉన్నాయనే అర్థం. కాకపోతే నేటి బిజీ లైఫ్‌లో, స్వార్థపు పోటీలో ఆ ‘మర్యాద’, ‘ధర్మం’ కాస్త మరుగున పడి ఉండొచ్చు కానీ పూర్తిగా అంతరించిపోలేదు. రామాయణం లాంటి కథలు చెప్పడం వెనుక అసలు ఉద్దేశమే అది. కుటుంబంలో, అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన నిజమైన ప్రేమను, నిస్వార్థ బంధాన్ని ఇది నేటి తరానికి బలంగా గుర్తుచేస్తుంది” అంటూ రణ్‌బీర్ చెప్పుకొచ్చారు. తోబుట్టువుల మధ్య ఆప్యాయతలు తగ్గిపోతున్న ఈ కాలంలో లక్ష్మణుడి నిస్వార్థ త్యాగాన్ని, రామాయణ విలువలను ప్రస్తావిస్తూ రణ్‌బీర్ చేసిన ఈ కామెంట్స్ సినీ అభిమానులతో పాటు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
- Ramayana: "డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?".. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
- Simbu - Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
- RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..