Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!

Ranabaali

Ranabaali

Ranabaali Release Date: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. “మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరుచుకోబోతోంది” అంటూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించడం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. దీంతో ఈ చిత్రం ఎలాంటి కథతో తెరకెక్కుతోంది? చరిత్రలోని ఏ సంఘటనను తెరపై ఆవిష్కరించబోతున్నారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో పాటు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. గతంలో ‘శ్యామ్ సింగ రాయ్’తో తనదైన మేకింగ్‌ను చూపించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ .. ‘రణబాలి’తో మరింత భారీ కాన్వాస్‌ను ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ కోసం యానిక్ బెన్, ఆండీ లాంగ్ న్గుయెన్ వంటి అంతర్జాతీయ స్టంట్ నిపుణులు భాగమయ్యారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ‘రణబాలి’ అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియడంతో ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానుల్లో మరింత హైప్ పెరిగింది.