RC16 : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతున్న ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేస్తున్నారు.ఈ సినిమా “RC16″అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేసిన ఈ సినిమా షూటింగ్ కోసం దర్శకుడు బుచ్చిబాబు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.అయితే గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కాకుండా రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ పాల్గొనకూడదని ఫిక్స్ అయ్యారు.అయితే తాజాగా rc16 మూవీ షూటింగ్ గురించి ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది .ఈ సినిమా షూటింగ్ లో రాంచరణ్ జూన్ నుంచి పాల్గొననున్నట్లు సమాచారం.”గేమ్ చేంజర్” సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.