Ramayana: తెలుగు రాష్ట్రాలో దిల్ రాజు బ్యాకింగ్‌తో వస్తున్న ‘రామాయణ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: మనందరి జీవితాల్లో, ప్రతి ఇంట్లో ఒక భాగమైపోయిన పవిత్ర కథ ‘రామాయణం’ ఇప్పుడు వెండితెరపై మునుపెన్నడూ చూడని విజువల్ ట్రీట్‌గా రాబోతోంది. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా రెడీ అవుతున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ అప్డేట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసలైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా రిలీజ్ బాధ్యతలను దిల్ రాజుకు చెందిన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ (SVC) సొంతం చేసుకుంది.
దిల్ రాజు ఒక ప్రాజెక్ట్ వెనుక నిలబడ్డారంటే థియేటర్ల సెటప్, హడావుడి ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ గ్రాండ్ సినిమా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ మతిపోయే విజువల్స్ ఉంటాయని, బిగ్ స్క్రీన్లపై ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. తోడుగా దిల్ రాజు చేతులు కలవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్థాయిలో స్క్రీన్లు దక్కడం పక్కాగా కనిపిస్తోంది. ఈ సినిమా విషయానికి వస్తే నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ‘రామాయణ’ చలనచిత్రం తెరకెక్కుతుంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. మరి నవంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Ramayana: తెలుగు రాష్ట్రాలో దిల్ రాజు బ్యాకింగ్‌తో వస్తున్న ‘రామాయణ’!
-
Box Office: యంగ్ హీరోల వందల కోట్ల రిస్క్! నిర్మాతలకు ముప్పు తప్పదా?
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
FSSAI: చిన్నారులకు చక్కెర పెడుతున్నారా?
-
MS Dhoni: ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ.. ఎంఎస్ ధోనీ వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!