Ram Gopal varma : మరో కొత్త చిత్రం ప్రకటించిన వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సక్సెస్ అందుకుని చాలా కాలమైంది. ప్రయత్నాలైతే చేస్తున్నాడు గానీ ఫలితం మాత్రం దక్కడంలేదు. ఆ సినిమా తీస్తాను? ఈ సినిమా తీస్తానని ప్రకటనలు చేస్తున్నాప్పటికి. అవి అక్కడికే పరిమితం అవుతున్నాయి తప్ప ప్రకటించిన ఏ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చడం లేదు. ఇటీవలే మళ్లీ పాత వర్మని చూపిస్తానని ప్రామిస్ చేసాడు. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అది కూడా దెయ్యం మీద. కెరీర్ ఆరంభంలో వర్మ ‘భూత్’ ‘12 వ అంతస్థు’, ‘రాత్రి’, ‘కౌన్’, ‘దెయ్యం’, ‘మర్రి చెట్టు’ లాంటి చాలా సినిమాలతో ప్రేక్షకుల్ని భయపెట్టి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. హర్రర్ మూవీస్ బాగా తీసేవాడు.
Also Read : Birth control pills : పిల్లలు కాకుండా గర్భ నిరోధక మాత్రలు వాడే వారికి బిగ్ అలర్ట్..
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
ఈ నేపథ్యంలో తాజాగా వర్మ ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే కొత్త హారర్ చిత్రాన్ని ప్రకటించారు. ‘మీరు చనిపోయిన వారిని చంపలేరు’ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. స్టోరీకి సంబంధించి ఇంకా లోతును వర్మ పంచుకున్నారు.. ‘మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు వెలతాము. కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారు? అన్న పాయింట్ మీదనే కథాంశం తిరుగుతుంది. ఒక ఘోరమైన ఎన్‌కౌంటర్ తర్వాత ఓ పోలీస్ స్టేషన్ దెయ్యాల స్టేషన్‌గా మారుతుంది. గ్యాంగ్‌స్టర్ల దయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరిగెత్తుంటారు’ అని తెలిపాడు. కాగ తన మాటలో ఈ సినిమాపై వర్మ చాలా కాన్పిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!