వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సంచలనంగానే మారుతుంటుంది. తాజాగా బిగ్ బాస్ బ్యూటీతో కలిసి వర్మ షేర్ చేసిన పిక్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఆ పిక్ లో వర్మ, బిగ్ బాస్ బ్యూటీ ఇద్దరూ వర్కౌట్లు చేస్తున్నట్టు కన్పిస్తున్నారు. “ఈ బిగ్ బాస్ లిటిల్ గర్ల్ అరియనా గ్లోరీ నన్ను జిమ్ లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇంటర్వ్యూ అయ్యాక ఇద్దరం కలిసి వర్కౌట్లు చేశాము… కమింగ్ సూన్” అంటూ అరియనాతో జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ పోస్ట్ చేశాడు వర్మ. ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంకేముంది నెటిజన్లు ఈ పిక్ పై రకరకాల కామెంట్స్ కురిపిస్తున్నారు. కాగా యాంకర్ గా అరియనా కెరీర్ ను మలుపు తిప్పింది రామ్ గోపాల్ వర్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వర్మను అరియనా ఇంటర్వ్యూ చేయగా… ఆ సమయంలో అరియనాపై ఆయన చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. దీంతో అరియనాకు క్రేజ్ రావడం… బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం జరిగింది. అరియనా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా వర్మ తనకు సపోర్ట్ చేశాడు. బిగ్ బాస్ లో చివరిదాకా కొనసాగి భారీగా అభిమానులను సొంతం చేసుకుంది అరియనా.