Site icon NTV Telugu

Ram Charan- Trivikram: రామ్ చరణ్-త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా? లేనట్టా?

Ram Charan

Ram Charan

రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. నిజానికి అదేమీ లేదని అర్థమయ్యేలా త్రివిక్రమ్ తరపున నిర్మాత నాగ వంశీ ఒక ట్వీట్ వేశాడు. ప్రస్తుతానికి వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రమే త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, ఆయనకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా తాను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని చెప్పాడు.
అయితే, రామ్ చరణ్‌తో సినిమా ఉంటుందా, ఉండదా అనే చర్చపై అనేక వార్తలు వస్తున్నాయి.

Also Read:Tollywood: మీడియా ‘లేపితే’ మాత్రం సినిమాలు ఆడేస్తాయా?

కానీ, ఇప్పట్లో రామ్ చరణ్ త్రివిక్రమ్‌తో సినిమా చేసే అవకాశం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా సైన్ చేశాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనుకున్నాడు, కానీ కొన్ని అంతర్గత కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టేశాడు.

Also Read:Trivikram- Jr NTR: త్రివిక్రమ్-ఎన్టీఆర్.. ఎన్నేళ్లకు?

తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ సుకుమార్ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు ఫైనల్ అయినప్పటికీ, అధికారికంగా అనౌన్స్ చేయకపోతే నిజమని చెప్పలేం. కాబట్టి, త్రివిక్రమ్-రామ్ చరణ్ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. భవిష్యత్తులో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. త్రివిక్రమ్ చెప్పిన కథ రామ్ చరణ్‌కు నచ్చినప్పటికీ, అంతర్గత కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Exit mobile version