రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. నిజానికి అదేమీ లేదని అర్థమయ్యేలా త్రివిక్రమ్ తరపున నిర్మాత నాగ వంశీ ఒక ట్వీట్ వేశాడు. ప్రస్తుతానికి వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రమే త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, ఆయనకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా తాను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని చెప్పాడు. అయితే, రామ్ చరణ్‌తో సినిమా ఉంటుందా, ఉండదా అనే చర్చపై అనేక వార్తలు వస్తున్నాయి.…