RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC 17 Movie Launch: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్‌చరణ్ – సుకుమార్ కాంబో అధికారికంగా పట్టాలెక్కింది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ ప్రాజెక్ట్‌ను ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర ముహూర్తపు సన్నివేశానికి స్వయంగా క్లాప్ కొట్టారు. తండ్రి చేతుల మీదుగా కొడుకు సినిమా మొదలుకావడంతో మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, టెక్నీషియన్లు కూడా ఈ వేడుకకు హాజరై చరణ్, సుకుమార్ జోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
సినిమా ఓపెనింగ్ జరగడంతోనే మరోవైపు క్యాస్టింగ్ పై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా చరణ్ సరసన హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారనే సస్పెన్స్ ఇంకా నడుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ పలువురి పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ, మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి పేరు అఫిషియల్‌గా బయటికి రాలేదు. త్వరలోనే హీరోయిన్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో కనిపించే నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన ఈ జోడీ, ఈసారి చిరంజీవి ఆశీస్సులతో మరింత భారీ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Also Read
- Irumudi : 'ఇరుముడి' నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
#YouCanImagine, but beyond everyone’s expectations 🎯🤩
#RC17 begins ❤️
Mega Power Star @AlwaysRamCharan is back with Master Storyteller @aryasukku ❤🔥
Shoot commences soon.
#RC2Sukku #SRC
@MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl https://t.co/2hwqOv7MoK
— #RC17 (@RC17Offl) November 1, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
-
CM Chandrababu: గతంలో ఎన్నడూ లేనంతటి స్ఫూర్తి కనిపిస్తోంది.. స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
-
Punjab: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!