Peddi Song : మెగా పవర్ స్టార్ ‘పెద్ది’.. సెకండ్ సింగిల్ డేట్ లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘చికిరి చికిరి’ యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ సింగిల్‌పై పడింది. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) లేదా మరుసటి రోజు ఫిబ్రవరి 15న ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఒక పవర్‌ఫుల్ మాస్ నెంబర్ అని, ముఖ్యంగా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా ఉండబోతోందని సమాచారం. ప్రేమికుల రోజున వస్తున్నప్పటికీ, ఇది లవ్ సాంగ్ కాకుండా పక్కా మాస్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘ఉప్పెన’ వంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో పాటల విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ చేసే డాన్స్ స్టెప్పులు ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట మార్చిలో అనుకున్నప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో ‘పెద్ది’ని ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ లోపు వరుస అప్‌డేట్స్‌తో సినిమాపై హైప్‌ను మరింత పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Toxic - Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
- Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
- Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!