Peddi: చరణ్ ‘పెద్ది’ సాంగ్‌కు రికార్డ్ వ్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, మేకర్స్ ఇటీవల విడుదల చేసిన క్రేజీ మాస్ నెంబర్ ‘హెల్లాళ్ళల్లో’ (#Hellallallo) వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. టాలీవుడ్లో ఒక మాస్ సాంగ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ రేంజ్ విధ్వంసం సృష్టించడం బహుశా ఇదే మొదటిసారి.
‘నాటు నాటు’ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న పక్కా లోకల్ మాస్ డ్యాన్స్ నెంబర్ కావడంతో.. దీనిపై దేశవ్యాప్తంగా అంచనాలు స్కై హై లో ఉన్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మాస్ అండ్ ఫోక్ బీట్స్‌కు, రామ్ చరణ్ ఇంటెన్స్ గ్రేస్ తోడవడంతో ‘హెల్లాళ్ళల్లో’ సాంగ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తోంది. కేవలం తెలుగు వెర్షన్లోనే, విడుదలైన 11 గంటల్లో ఏకంగా 18 మిలియన్లకు పైగా (18 Million+ Views) వ్యూస్ రాబట్టి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రికార్డ్‌ను నమోదు చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాట ‘టాప్ ట్రెండింగ్’ లో కొనసాగుతోంది. చరణ్ పక్కన గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ వేసిన స్టెప్పులు, మెయిన్ లీడ్ జాన్వీ కపూర్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తున్నాయి.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఈ చార్ట్‌బస్టర్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తున్న తరుణంలో, మైత్రీ మూవీ మేకర్స్ అండ్ టీమ్ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ అండ్ రేర్ మూమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలలో రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్లతో పాటు ఈ చిత్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar), చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన, మరియు స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు (Rathnavelu) కలిసి చాలా హ్యాపీగా చిల్ అవుతూ కనిపించారు. సెట్స్‌లో వీరంతా కలిసి ఉన్న లొకేషన్ పిక్స్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వాట్సాప్ స్టేటస్లు, ట్విట్టర్ టైమ్‌లైన్స్‌లో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఇక వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!