Rakul Preet Singh Once Rejected a Guy due to Food Order: రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసేది. ఇప్పుడు బాలీవుడ్‌లో ‘యారియమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రకుల్ అక్కడే ఒక హీరో కం నిర్మాతను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది కూడా. ఇక సినిమాల విషయానికి వస్తే నటి రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా అజయ్ దేవగన్‌తో కలిసి రన్‌వే 34 చిత్రంలో కనిపించింది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఇప్పుడు రకుల్ లవ్ బ్రేకప్ వెనుక ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసింది. అదేమంటే ఆమె ఒక వ్యక్తితో డేటింగ్‌లో ఉండగా అతను రకుల్ కు ఫుడ్ ఆర్డర్ చేశాడట.
Devara: దేవర టికెట్ రేట్లు పెంచారు.. ఎంతంటే?
రకుల్ ని సంతోష పెట్టాలని అలా చేసి బ్రేకప్ చెప్పించుకున్నాడు. ఎందుకంటే అతను రకుల్ కోసం ఫ్రైడ్ స్నాక్స్ ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఇది చూసి రకుల్ కి కోపం వచ్చింది. ఆ క్షణమే నేను అతని ప్రేమను తిరస్కరించాను అని రకుల్ పేర్కొంది! హోస్ట్ రణ్‌వీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి ఈ విషయాన్ని వెల్లడించింది. అతను చాలా వేయించిన ఆహారాన్ని ఇష్టపడేవాడని ఆమె పేర్కొంది. అయితే తాను జాకీ భగ్నానిని కలవడానికి ముందని చెప్పుకొచ్చింది. “ఫ్రైడ్ ఫుడ్ ఆర్డర్ చేసే వారిని నేను ప్రేమించలేను” అని రకుల్ చెప్పింది. అతను నేను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తక్కువగా చూసాడు, ఫ్రైడ్ ఫుడ్ తినమని చెప్పాడు. ఒక రిలేషన్ లో ఉన్నవారు భోజనం, లైఫ్ స్టైల్ షేర్ చేసుకోలేక పోతే అది అర్ధంలేనిదని ఆమె పేర్కొంది. ఇండియన్, చైనీస్ ఫుడ్ విషయంలో స్నేహితులు గొడవపడటం చూశా, ఇవన్నీ నాకు నచ్చవు. అందుకే రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. దీంతో ఆ ఫుడ్ ఆర్డర్ చేశాడని రకుల్ బ్రేకేప్ చెప్పిందా పాపం ఎవరో తెలుసా? అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.