Rajinikanth173 : సూపర్ స్టార్ 173 టైటిల్ ‘ధర్మన్’ ది డెడ్లీ డాక్టర్.. దర్శకుడు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ 173సినిమాపై సస్పెన్స్ తొలగిపోయింది. మొదట ఈ సినిమాను సుందర్ సి దర్శకత్వంలో ప్రకటించారు. కానీ సుందర్ సి అనుకోని కారణాలతో ఈ సినిమా నుండి వైదొలిగాడు. దాంతో రజనీ 173కి డైరెక్టర్ ఎవరనేదానిపై పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి కానీ అవేవి కన్ఫామ్ కాలేదు. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు రజినీని డైరక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రానికి ‘ ధర్మన్’ ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ.. తాజాగా మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ది డెడ్లీ డాక్టర్’గా రజనీకాంత్ మాస్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రజనీకి జోడిగా తమిళ్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించబోతోంది. అలాగే యంగ్ హీరోయిన్ రాశిఖన్నా కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త అయోమయం నెలకొంది. గతంలో చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఎలాంటి రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రస్తావించలేదు. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్ నటిస్తున్న మరో సెన్సేషనల్ సీక్వెల్ ‘జైలర్ 2’ అని తెలుస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘జైలర్ 2’ ఈ ఏడాది చివరి త్రైమాసికంలో థియేటర్లలోకి వచ్చేందుకు షెడ్యూల్ చేయబడింది. రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్ నటించిన రెండు భారీ చిత్రాల మధ్య కచ్చితంగా తగినంత గ్యాప్ ఉండటం బాక్సాఫీస్ పరంగా చాలా అవసరం. అందుకే ‘జైలర్ 2’ విడుదలైన వెంటనే కాకుండా, ‘ది డెడ్లీ డాక్టర్’ చిత్రాన్ని 2027 సమ్మర్ సీజన్‌కు పోస్ట్‌పోన్ చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Nidhhi Agerwal: బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్‌కు ఈడీ షాక్: 4 గంటల పాటు ప్రశ్నల వర్షం!
- Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
- Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
తాజావార్తలు
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
-
SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
-
CI Viral Video : విద్యార్థుల గొంతు నులిమిన సీఐ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!