Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwath Marimuthu: సీనియర్ స్టార్ హీరోలతో సినిమా అంటే సాధారణంగా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా అయితే ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. కానీ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి బరిలో సినిమాను నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం చూస్తుంటే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గుర్తుకు రావడం సహజమే. ఆయన కూడా తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేస్తూ.. వేగంగా రిలీజ్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో కోలీవుడ్‌లో ఓ యంగ్ డైరెక్టర్ రజినీకాంత్‌తో సినిమా చేస్తున్నాడు. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అశ్వత్ మారిముత్తుకు రజినీకాంత్ స్వయంగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. పలువురు దర్శకుల పేర్లను పరిశీలించిన తర్వాత.. ‘తలైవర్ 173’ బాధ్యతలను అశ్వత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’ అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో సిమ్రాన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ పోతినేని కీలక పాత్రలో కనిపించనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా తొలి షెడ్యూల్ పూర్తవగా.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా అశ్వత్ మారిముత్తు ఒక ఇంటర్వ్యూలో తన సినిమా లైనప్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రజినీకాంత్‌తో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన ఆయన.. ఈ మూవీ షూటింగ్‌ను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అంటే షూటింగ్ స్టార్ట్ చేసిన ఐదు నెలల్లోనే రజినీకాంత్ వంటి సీనియర్ స్టార్‌తో పాన్ ఇండియా సినిమాను పూర్తి చేయాలని అశ్వత్ ప్లాన్ చేస్తున్నాడన్నమాట. దీంతో కోలీవుడ్‌లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ‘ధర్మన్’ను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అశ్వత్ మారిముత్తు తన తదుపరి ప్రాజెక్ట్‌ను శింబుతో చేయనున్నాడు. వాస్తవానికి రజినీకాంత్ సినిమాకంటే ముందే శింబుతో సినిమా చేయాల్సి ఉంది. అయితే శింబు నటిస్తున్న ‘అరసన్’ షూటింగ్ ఆలస్యం కావడంతో.. అశ్వత్ ముందుగా రజినీకాంత్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. మరోవైపు అశ్వత్ మారిముత్తు ‘దయానగరం’ అనే సినిమాలో చిన్న పాత్రలో కూడా కనిపించనున్నట్లు సమాచారం. మొత్తంగా రజినీకాంత్‌తో పాన్ ఇండియా మూవీని ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయాలనే అశ్వత్ ప్లాన్ ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది.
Also Read
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!