Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ స్టార్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దీపికా మరోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించడంతో నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా దీపికా డెలివరీ సమయం, ఆసుపత్రి చేరికపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ, ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్వీర్–దీపిక సంయుక్తంగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. “వెల్కమ్ బేబీ గర్ల్.. 19|9|2026 – దువా, దీపిక, రణ్వీర్” చిన్నారి పాదముద్రలతో కూడిన కార్డును పోస్ట్ చేస్తూ, కేవలం దిష్టి తగలకుండా ఉండే ‘ఈవిల్ ఐ’ (🧿) ఎమోజీని క్యాప్షన్‌గా జోడించారు.
ఈ వార్తలో నెటిజన్లను, సినీ వర్గాలను ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం ఏంటంటే – ప్రసవానికి కేవలం ఒక్క రోజు ముందే ఈ జంట ముంబైలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకోవడం. ఆ సమయంలో కెమెరాల కంటికి చిక్కకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరు పూజలు నిర్వహించడంపై బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. వ్యక్తిగత జీవితాన్ని, ప్రెగ్నెన్సీ ప్రయాణాన్ని ప్రచారార్భాటం లేకుండా అత్యంత గోప్యంగా ఉంచే విషయంలో ఈ జంట వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వీరికి ‘దువా’ అనే కుమార్తె ఉండగా, ఇప్పుడు మరో చిన్నారి రాకతో తమ కుటుంబం ముగ్గురి నుంచి నలుగురికి చేరిందని ఈ జంట ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీపికా, చిన్నారి ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు సమాచారం. ఆలియా భట్, కత్రినా కైఫ్, కరణ్ జోహార్ సహా పలువురు చిత్ర ప్రముఖులు, అభిమానులు ఈ స్టార్ కపుల్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
Also Read
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
తాజావార్తలు
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!