సలార్ హిట్‌తో ప్రభాస్ గాడిలోపడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు రూ. 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజాసాబ్‌తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్‌కు ట్రైలర్ సమాధానం చెప్పేసిందా? దర్శకుడు మారుతిపై వున్న అనుమానాలు తొలిగిపోయాయా? ఇంతకీ టీజర్ ఎలా వుందో చూసేద్దామా. రెండేళ్లుగా సెట్స్‌పై వున్న రాజాసాబ్ ట్రైలర్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీజర్..ట్రైలర్.. సాంగ్సే కాదు.. సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జనవరి 9న థియేటర్స్‌లోకి వస్తోంది. ఆరు నెలల ముందే టీజర్ రిలీజ్ చేసి సినిమాలపై అంచనాలు పెంచేసిన మారుతి మూడు నెలల ముందే ట్రైలర్‌ను వదిలేశాడు.
Also Read : AA22xA6 : అట్లీ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?
లో బడ్జెట్ మూవీస్ తీసే మారుతి ప్రభాస్‌ను డైరెక్ట్ చేయగలడా. ఈ డౌట్ ఫ్యాన్స్‌కే కాదు మారుతి ఇంట్లో కూడా వచ్చింది. మారుతిని తీసుకుని ప్రభాస్ రాంగ్‌స్టెప్ వేశాడని అందరూ అంటుంటే ఒకానొక దశలో ప్రాజెక్ట్ వదిలేద్దామనుకున్నానని ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా తీశానన్నాడు మారుతి. తాజాగా రిలీజ్ అయిన రాజాసాబ్ ట్రైలర్ బుజ్జిగాడులో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకుని పాన్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్ ను సెట్ చేసి డార్లింగ్‌ను ఫ్యాన్స్ మెచ్చే విధంగా సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది. వింటేజ్ రెబల్ స్టార్ ను మరోసారి ఫ్యాన్స్ కు చూపించాడు మారుతీ. కానీ ఈ మూడు నిమిషాల ట్రైలర్ కు తమన్ ఇచ్చిన నేపధ్యసంగీతం చప్పగా ఉండనే కామెంట్స్ ఫ్యాన్స్ నుండి వినిపిస్తోంది. తమన్ రెగ్యులర్ గా ఇచ్చే సౌండింగ్ లా ఉంది తప్ప కిక్ ఇచ్చే బీజీఎమ్ ఇవ్వలేదని, మిక్సింగ్ కూడా అంతంత మాత్రంగా ఉందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ సినిమాల ఫ్లేవర్ ట్రైలర్ లో కనిపించింది.