Lavanya Drunk Driving Case: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్‌చల్.. కేసు నమోదు!
- మరోసారి వార్తల్లో నిలిచిన లావణ్య
- మద్యం మత్తులో లావణ్య హల్‌చల్
- లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు
- కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య మరోసారి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. మద్యం మత్తులో ఉన్న ఆమె సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పాజిటివ్ రావడంతో.. లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి లావణ్య కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
లావణ్య మల్లేపల్లి వద్ద తన కారుతో ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం ఆమె పారిపోతుండగా.. కారును మల్లేపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. సారీ చెప్పాలని గ్రామస్థులు కోరినా ససేమిరా అన్నారు. అంతేకాకుండా లావణ్య గ్రామస్థులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. వారితోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమెపై కేసు నమోదు చేశారు.
Also Read
- Vijay Deverakonda: 'కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం'
- Mythri Ravi: 'తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం'
- Nagarjuna: 'పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే'
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
Also Read: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!
గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. కొంతకాలంగా వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న లావణ్య.. ఇప్పుడు ఈ ఘటనతో మారోసారి హైలైట్ అయ్యారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సహజీవనం చేసి మోసం చేశాడని లావణ్య సంచలన ఆరోపణలు చేస్తూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ గుడిలో తనను వివాహం చేసుకున్నాడని, ఇప్పుడు మరో నటితో సంబంధం పెట్టుకుని తనను దూరం పెట్టాడని ఆరోపించారు. తామిద్దరం విడిపోయామని, తనపై వస్తున్నవి అబద్ధపు ప్రచారాలని ఈ ఆరోపణలను రాజ్ తరుణ్ ఖండించారు. ఈ వ్యవహారం తెగల్లో టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపింది.
తాజావార్తలు
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన.. వన్డేల్లో జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!