బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన మాజీ భార్య కవితపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో కవిత ఓ ఇంటర్వ్యూలో తాను తన భర్తకు దూరం కావడానికి శిల్పా శెట్టి కారణమని ఆరోపించింది. అప్పట్లో రాజ్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో రాజ్ స్పందించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రాజ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ కవితతో పెళ్లయిన కొత్తలో తాము యునైటెడ్ కింగ్డమ్ లో తన తల్లిదండ్రులు, చెల్లెలు ఆమె భర్తతో కలిసి ఉండేవాళ్లమని, ఆ సమయంలో కవిత తన చెల్లెలి భర్తతో ఎఫైర్ నడిచిందని, ఈ విషయం తెలియడంతోనే తను విడాకులు తీసుకున్నానని తెలిపారు. ఇందులో శిల్ప ప్రమేయం ఏమీ లేదని, తన గురించి అన్నీ తెలిసిన తర్వాతనే శిల్పా తనను ప్రేమించి పెళ్లాడిందని వెల్లడించారు. తాజాగా ఆయన సోదరి రీనా కూడా రాజ్ చెప్పిన మాట నిజమేనని వెల్లడించింది. రీనా మాట్లాడుతూ కవితను సోదరిలా భావించానని, ఎంతో సన్నిహితంగా ఉండేదాన్నని, ఆమెను ఎంతగానో నమ్మను అని చెప్పుకొచ్చింది. అలాంటిది ఆమెకు తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొవాలని, తనని ఎలా మోసం చేయాలని ఎలా అనిపించిందో తెలియదని, కానీ ఈ విషయం తెలియగానే తన గుండె బద్దలైంది అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరి వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.