శిల్పాశెట్టి కెరీర్ కు రాజ్ కుంద్రా వ్యవహారంతో బ్రేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిల్పాశెట్టి దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘హంగామా -2’ ఈ రోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. గత ఐదు రోజులుగా సాగుతున్న రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ వ్యవహారంతో ‘హంగామా -2’ మూవీ ప్రమోషన్స్ పై శిల్పాశెట్టి ఏ మాత్రం దృష్టి పెట్టలేకపోయింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లోనూ శిల్పాశెట్టి పాల్గొనడం డౌటే అంటున్నారు. ఇన్నేళ్ళ తర్వాత తిరిగి ఆమె సినిమా విడుదలవుతోందంటే దాన్ని తన కెరీర్ కు బలమైన పునాదిగా మలుచుకోవడానికి శిల్పాశెట్టి చాలా ప్లాన్స్ వేసుకుని ఉంటుంది. కానీ భర్త వ్యవహరంతో అవన్నీ కొట్టుకుపోయాయి. అలానే శిల్పాశెట్టి నటించిన మరో సినిమా ‘నికమ్మ’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ మూవీ ప్రమోషన్స్ లోనూ శిల్పాశెట్టి పాల్గొంటుందా లేదా అనేది అనుమానమే.
Read Also : రాజ్ కుంద్రా కర్మ… ఖర్మగా తిరిగొచ్చిందంటోన్న సచిన్ జోషి…
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఇదిలా ఉంటే… ప్రస్తుతం శిల్పాశెట్టి ‘సూపర్ డాన్సర్ చాప్టర్ 4’ రియాలిటీ షో లో జడ్జ్ గా దర్శకుడు అనురాగ్ బసు, గీతా కపూర్ తో కలిసి పాల్గొంటోంది. కానీ భర్త అరెస్ట్ అయిన మర్నాటి నుండి ఆమె ఆ షోకు హాజరు కావడం లేదు. గతంలోనూ శిల్పాశెట్టి కరోనా కారణంగా డుమ్మా కొడితే, ఆమె స్థానంలో మలైకా అరోరాను తీసుకున్నారు. ఇప్పుడైతే స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కరిష్మా కపూర్ తో ఎపిసోడ్ లాగించేస్తున్నారట. భర్త రాజ్ కుంద్రా వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే వరకూ శిల్పాశెట్టి ఈ డాన్స్ షోలో పాల్గొనక పోవచ్చునని తెలుస్తోంది. అదే జరిగితే, కరిష్మా, మలైకాలో ఎవరో ఒకరిని శాశ్వత జడ్జ్ గా తీసుకుంటారన్న బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద శిల్పాశెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఎంత గ్రాండ్ గానో ప్లాన్ చేసుకుంటే… ఆ ఆశలపై రాజ్ కుంద్రా వ్యవహారంతో నీళ్ళు కుమ్మరించినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..