ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ చిత్రం కోసం ఇటలీ నేపథ్యంలో 1970కి చెందిన ఓ హాస్పిటల్ సెట్ ను ఆ మధ్య ఓ స్టూడియోలో వేశారు. దానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం ఇప్పటికే పూర్తయిపోయింది. హైదరాబాద్ అవుట్ కట్స్ లో నిర్మాత ఈ హాస్పిటల్ సెట్ కు సంబంధించిన ఎక్వీప్ మెంట్స్ ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఇంతలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఉందని తెలుసుకున్న ‘రాధేశ్యామ్’ ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి తమ చిత్రం కోసం తయారు చేసిన యాభై బెడ్స్ ను ఆ హాస్పిటల్ కు ఇద్దామని నిర్మాతతో చెప్పాడట. యూవీ క్రియేషన్స్ అధినేతలు ప్రమోద్, వంశీ సైతం అంగీకరించడంతో ఇటీవల మొత్తం ఏడు పెద్ద ట్రక్స్ లో యాభై మంచాలను, షూటింగ్ కోసం తయారు చేసిన స్ట్రెక్చర్స్, సలైన్ స్టాండ్స్ తదితర వస్తువులన్నింటినీ హాస్పిటల్ కు డొనేట్ చేశారు. తమ చిత్రం కోసం తయారు చేసిన వాటిని ఈ కరోనా కష్టకాలంలో ఇలా ఉపయోగించడం సబబుగా అనిపించిందని హీరో ప్రభాస్ తో పాటు దర్శక నిర్మాతలూ తెలిపారు. మొత్తానికీ ‘రాధేశ్యామ్’ హాస్పిటల్ సెట్ కోసం తయారు చేసిన ప్రతి ఉపయోగపడే వస్తువూ రియల్ హాస్పిటల్ కు చేరడం, అక్కడ కరోనా బాధితుల కోసం వాటిని వాడటం నిజంగా గొప్ప విషయమే!