విడుదలకు సిద్ధమైన ‘రైతన్న’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘రైతన్న’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదివారం రైతు నాయకుల కోసం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో దీనిని ప్రదర్శించారు. ‘రైతన్న’ సినిమాను వీక్షించిన వారిలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదండ రెడ్డి, సీపిఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సిపీఎం నాయకులు మధు, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎంఎల్సీసి గోరటి వెంకన్న, కవి అందెశ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి, గోవర్ధన్, రైతు సంఘం సాగర్, శ్రీమతి పద్మ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, ”ఇందులోని పాటలను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావు పాడారు. వారికి నా నివాళి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి అని చెబుతూ ‘రైతన్న’ సినిమా తీశాను. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమే. ఇవాళ రైతు పరిస్థితి ఏమిటి? రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజు అనే నానుడి ఏమైంది? అన్నం పెట్టే అన్నదాత ఏ పొజిషన్ లో వున్నాడు? ఇదే ఈ సినిమాలో చూపించాం. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్ లను ఇంప్లిమెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్దత కలిపించిన నాడు రైతే రాజు. రైతే దేశానికి వెన్నుముక. అప్పుడు రైతు వృద్ధి లోకి వస్తాడు. అదే ‘రైతన్న’ సినిమా సారాంశం” అని అన్నారు.
Also Read
- Meghamsh Srihari: నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
- Suriya: ‘‘ఈ సక్సెస్ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
- Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
”భారత రైతాంగం ఏడు నెలల నుంచి వ్యవసాయ, విద్యుత్ చట్టాలపై పోరాడుతోందని, ఎంతో ధైర్యం చేసి నారాయణ మూర్తి ఈ సినిమా తీసినందుకు అభినందనలు తెలుపుతున్నా’నని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. ‘అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే కార్యక్రమం కేంద్రం చేస్తోంద’ని సిపీఎం నాయకుడు చాడా వెంకటరెడ్డి విమర్శించారు. ‘కేంద్రం తెచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాల’ని గద్దర్ డిమాండ్ చేశారు. ఈ సినిమా ప్రజలలోకి వెళ్ళి వారిలో చైతన్యం తీసుకురావాలని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘రైతన్న’ చిత్రం ద్వారా ప్రస్తుతం రైతులు పడుతున్న వెతలను నారాయణమూర్తి కళ్ళకు కట్టినట్టు చూపారని మిగిలిన వక్తలు ప్రశంసించారు.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!