The Paradise: నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా “ది ప్యారడైజ్’ ఓ రేంజ్ లో దుమారం రేపుతోంది. కేవలం టైటిల్ అనౌన్స్ చేసిన టీజర్ తోనే ఇండస్ట్రీ లుక్ మొత్తం ఈ సినిమావైపే వెళ్లిపోయింది. ఏకంగా హీరో క్యారెక్టర్ ను లం* కొడుకు అంటూ పరిచయం చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సినిమాపై డిబేట్లు, చర్చలు నడిచేలా చేసింది ఈ ఒక్క టీజర్. సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. నేచురల్ సినిమాలు చేసుకునే నానితో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సారి ఊహించని హింసతో వస్తున్నాడంటూ పెద్ద ప్రచారం లేపుతున్నారు.
Read Also: Tragedy: బాణసంచా పేలుడు.. ఊపిరాడక ఐదుగురు మృతి
ఇలాంటి టైమ్ లో పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నారాయణ మూర్తి నలభై ఏళ్ల క్రితం సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేశాక ఇతర హీరోల సినిమాల్లో నటించట్లేదు. ఎంత పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే చేయట్లేదు. టెంపర్ సినిమాలో పోసాని చేసిన పాత్రలో ముందు పీపుల్ స్టార్ నే అడిగారు. కానీ ఆయన చేయనని చెప్పేశారు. ఇలా ఎవరి సినిమాల్లోనూ నటించని నారాయణ మూర్తి ఇప్పుడు నాని సినిమాలో నటిస్తున్నాడంటూ చెబుతున్నారు. ఇది అసలు నమ్మేలా కూడా లేదంటున్నారు ఆయన అభిమానులు.
Read Also: Puri : మొన్న చిరంజీవి, నేడు నాగ్?
ఎందుకంటే నారాయణ మూర్తి కేవలం విప్లవాత్మక, సందేశాత్మక సినిమాల్లో మాత్రమే నటిస్తుంటారు. అది కూడా తన సొంత బ్యానర్ లో చేసే సినిమాల్లోనే కనిపిస్తారు. అంతే తప్ప ఇతర హీరోల సినిమాల్లో నటించే వ్యక్తి కాదు. నలభై ఏళ్లుగా ఒక్క హీరో సినిమాలో కూడా నటించలేదంటేనే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమైపోతోందని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. రీసెంట్ గా పీపుల్ స్టార్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిసి ఓ ఫొటోను షేర్ చేశారు. అది క్యాజువల్ గా కలిసింది కాదని.. తన సినిమాలో పాత్ర కోసమే కలిశారంటూ ప్రచారం చేస్తు్న్నారు. మరి ఎవరి సినిమాల్లోనూ నటించని పీపుల్ స్టార్.. నాని కోసం ఒప్పుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం మరో సంచలన నిర్ణయమే అవుతుంది.