పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నారాయణ మూర్తి నలభై ఏళ్ల క్రితం సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేశాక ఇతర హీరోల సినిమాల్లో నటించట్లేదు. ఎంత పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే చేయట్లేదు. టెంపర్ సినిమాలో పోసాని చేసిన పాత్రలో ముందు పీపుల్ స్టార్ నే అడిగారు. కానీ ఆయన చేయనని చెప్పేశారు.