ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Pushpa2 TheRule : పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ వేదిక మారే అవకాశం..?
భారీ బడ్జెట్ పై తెరకెక్కిన పుష్ప -2 కు నైజాంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు కోసం ఎదురుచూస్తున్న మేకర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణా ప్రభుత్వం. నైజాంలో పుష్ప -2 కి ఎన్నడూ లేని రేట్లు ఇస్తూ జీవో జారీ చేసింది. పుష్ప2 చిత్ర టికెట్ ధరల పెంపుటికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతోపాటు అర్థరాత్రి 1 గంట షోలకు టికెట్ ధరలు రూ.1121 సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ రూ. 1239 ఖరారు చేసింది. ఇక డిసెంబరు 5 న రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ ధర రూ. 354, మల్టీఫ్లెక్స్ లో రూ. 531 గా ఉండనుంది. ఇక 5వ రోజు నుండి 12 వ రోజు వరకు సింగిల్ స్క్రీన్ రూ. 300, ముల్టీప్లెక్స్ లో రూ. 472 గా అనుమతులు ఇచ్చారు. ఇక 13వ రోజు నుండి 29 వరకు రూ. సింగిల్ స్క్రీన్ రూ. 200, మల్టిప్లెక్స్ లో రూ. 354 గా నిర్ణయించారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇవ్వని వెసులు బాటు పుష్ప కు కల్పించారు. ఈ విధంగా చుస్తే పుష్ప -2 డే 1 కలెక్షన్స్ భారీ నంబర్ ఉండే అవకాశం ఉంది.