స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అమెరికా ప్రధాన నగరాల్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. థమన్ యుఎస్ఎలో తన లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ లైవ్ కాన్సర్ట్ కు ఆసక్తికరంగా “అల అమెరికాపురములో” అని పేరు పెట్టారు. తాజా అప్డేట్ ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు “అల అమెరికాపురంలో” ప్రోమోను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు.
Read Also : రానా దగ్గుబాటి న్యూ లుక్ వైరల్
ఈ కచేరీ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వాషింగ్టన్ డి.సి, చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్, డల్లాస్ వంటి ప్రధాన యూఎస్ నగరాల్లో జరుగుతుంది. తమన్ తన బృందంతో పాటు యువ ప్లేబ్యాక్ గాయకుల బృందంతో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు. భారతీయ చలన చిత్ర పంపిణీ, మ్యూజికల్ కాన్సర్ట్ ప్రొడక్షన్, ప్రసిద్ధ అంతర్జాతీయ డెలివరీ భాగస్వామి అయిన హంసిని ఎంటర్టైన్మెంట్ తమన్ సంగీత కచేరీని నిర్వహించనుంది.