బిగ్ ప్రాజెక్టుల కారణంగా నిర్మాతలు చితికిపోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మాట చెప్పింది ఒక్కరు కాదు. ఇద్దరుముగ్గురు నిర్మాతలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆ మాట నిజమే అనిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే ఈ మధ్య ‘క’ సక్సెస్ మీట్ సందర్భంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇక్కడ ఎవరూ ఎవరికీ సపోర్ట్ చేయరు.. మీరు కష్టపడి మీరు సక్సెస్ కావాలి, అప్పుడే మేమొచ్చి అప్లాజ్ చేస్తామంటూ డార్క్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి ఓపెన్‌గా చెప్పేశారు. తాజాగా నాగ వంశీ సైతం నెక్ట్స్ తన సినిమా వచ్చేటప్పుడు సింపథీ కార్డ్ ప్లే చేయాల్సిందే అంటూ.. రీసెంట్ టైమ్స్‌లో తన సినిమా రిజల్ట్ విషయంలో ఫేస్ చేసిన ఎదురు దెబ్బలను ఉద్దేశించి కామెంట్ చేశారు.
Nayanathara- Dhanush: నయనతార విషయంలో అందుకే ధనుష్ మౌనం?
అలాగే తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఇలాంటి ఓపెన్ కామెంట్స్ చేశాడు. ధర్మ ప్రొడక్షన్ సంస్థ 50 శాతం షేర్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదార్ పూనావాలాకు విక్రయించిన న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. లాస్ వల్ల తన వాటా అమ్మేస్తున్నాడన్న విమర్శలపై ఎట్టకేలకు స్పందించి అందుకే చేశానని యాక్సెప్ట్ చేశాడు. ‘బడా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు అంత అమౌంట్ ఉండదు.. అందుకే బిగ్ స్టూడియోలతో చేతులు కలపాలి.. తప్పదు.. చాలా మంది భారీ బడ్జెట్ సినిమా చేస్తే లాభాలు వస్తాయని అని అనుకుంటారు. కానీ అబద్ధం. చిన్న బడ్జెట్ సినిమాలు చేసి సక్సెస్ అయితే ప్రాఫిట్ వస్తుంది’ అని చెబుతున్నారు. బ్రహ్మస్త్ర విషయంలో ఇదే జరిగిందట . బ్రహ్మాస్త్ర’ రూ.420 కోట్లు రాబట్టింది.. కానీ సినిమా బడ్జెట్టే 400 కోట్లు. లాభం కేవలం 20 కోట్లు మాత్రమే. ఒకసారి లం సమ్ అమౌంట్ ఎంతటి బడా నిర్మాతకైనా భారమే. దీంతో అంతటి బడ్జెట్ పెట్టలేక.. మరొకరితో టయ్యప్ కావాల్సిన పరిస్థితి. ఇదే ధర్మ ప్రొడక్షన్ సేల్కు కారణమైంది. వెయ్యి కోట్లు పెట్టి అదార్ పూనావాలా 50 శాతం షేర్ కొన్నాడు. ఇదే పరిస్థితులు టాలీవుడ్‌లోనూ కనిపిస్తున్నాయి. దిల్ రాజు, నాగవంశీ, కరణ్ జోహార్ లాంటి స్టార్ నిర్మాతలే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాయని చెబుతుంటే.. ఇక చోటా నిర్మాతల సంగతేంటంటారు..?