నిర్మాత నాగవంశీ తనవైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నాగవంశీ ఇప్పుడు మరోసారి అదేవిధంగా వార్తల్లోకి ఎక్కాడు. ‘మాస్ జాతర’ సినిమాకి సంబంధించి ఒక కామన్ ఇంటర్వ్యూలో, ‘లోకా’ సినిమా గురించి నాగ వంశీ కామెంట్స్ చేశాడు. ఆ సినిమా మలయాళం నుంచి వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ, స్ట్రైట్ తెలుగు సినిమా అయి ఉంటే, సినిమా ల్యాగ్ ఉందని, స్పాన్ సరిపోలేదని, ఇలా రకరకాల కామెంట్స్ వచ్చేవి. కానీ, అది మలయాళ సినిమా కావడంతో దాన్ని యాక్సెప్ట్ చేశారని అన్నారు. నిజానికి నాగవంశీ చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నా, లాజిక్ మాత్రం కరెక్ట్ గా లేదు.
Also Read : Prashant Kishor: ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల విత్‌డ్రా.. బీజేపీ ఒత్తిడితోనే జరిగిందన్న ప్రశాంత్ కిషోర్
అది తెలుగులో వచ్చి ఉంటే కచ్చితంగా ఆ సినిమా మీద అంచనాలు భారీగా ఉండేవి. ఇప్పటికే తెలుగు సినిమా ఖ్యాతి ఖండాతరాలు దాటింది. ‘బాహుబలి’ సహా, తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు సినిమా అనగానే ఒక స్కేల్ సెట్ చేసి పెట్టేసాయి. కాబట్టి, తెలుగు నుంచి వస్తుందంటే ఆ సినిమాకి తగ్గ అన్ని హంగులు, ఆర్భాటాలతో పాటు అన్ని సమపాళ్లలో ఉంటే కానీ, తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. ‘లోకా’ అనేది మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన సినిమా. అక్కడ ఐదారు కోట్ల నుంచి 20 కోట్లలోపే సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి నుంచి ఒక భారీ బడ్జెట్ సినిమా, అది కూడా సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో రావడానికి అందరూ ఆదరిస్తారు. అలా అని దాన్ని నెత్తిన పెట్టేసుకోరు. చూసి పర్వాలేదు అనుకుంటే కొంతవరకు ఆదరణ దక్కుతుంది, కానీ నాగ వంశీ చెప్పినట్టు దాన్ని ఏమీ నెత్తిన పెట్టుకుని మోసేయరు. కాబట్టి, నాగవంశీ లాజిక్స్ ఇక్కడ లాజిక్ లెస్‌గా అనిపిస్తున్నాయనే చెప్పాలి.