Nara Lokesh: గోల్డ్ కోస్ట్ క్యాంపస్ లో గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో ఏపీ విద్య అండ్ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను ఆయన పరిశీలించారు. గ్రిఫిత్ వర్సిటీ ప్రత్యేకతల గురించి మార్నీ వాట్సన్ వివరించారు. 1975లో స్థాపించిన తమ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. క్వీన్స్ ల్యాండ్ లో యూనివర్సిటీకి గల 5 క్యాంపస్ లలో 50 వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పుకొచ్చారు. పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్- గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
Read Also: Dhruv : నాకు తెలుగులో నటించాలని ఉంది..
ఇక, పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్ ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధృవీకరణ, గ్లోబల్ అకడమిక్ ప్రమాణాల కోసం ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ తో భాగస్వామ్యం వహించాలన్నారు. పునరుత్పాదక శక్తి, వాతావరణ స్థితి స్థాపకత, ప్రజారోగ్యం, నీటి నిర్వహణ రంగాల్లో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభించడంతో పాటు గ్రిఫిత్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ విద్యాసంస్థల మధ్య డ్యూయల్-డిగ్రీ లేదా ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయాలని నారా లోకేష్ తెలిపారు.