Priya darshi: హాస్యనటుడి నుండి అందరూ మెచ్చే హీరోగా మారిన దర్శి..!
- ఈ నెల 19న డార్లింగ్ విడుదల
- నాని నిర్మాతగా ప్రియదర్శి హీరోగా సినిమా ఫిక్స్
- బలగం చిత్రానికి నేను పెద్ద ఫ్యాన్: నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాస్యనటుడుగా పెళ్లిచూపులు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రియదర్శి . కమెడియన్ రోల్స్ మాత్రమే కాకుండా కథా బలం ఉన్న పలు వెబ్ సిరీస్ లు నటిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దర్శి. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి.
గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశం సినిమాలో తన నటనతో అందరి ప్రశంసలు పొందాడు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన బలగం చిత్రంతో ఆడియెన్స్ మెప్పు పొందడమే కాకుండా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో నిర్మాతలు దర్శితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డితో “డార్లింగ్” అనే సినిమా చేసాడు ఈ హీరో. దర్శికి జోడిగా అందాల నటి నభా నటేశ్ నటిస్తోంది. ఈ చిత్రం ప్రీ – రిలీజ్ ఈవెంట్ గత రాత్రి పార్క్ హయత్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Also Read
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Jagame Sangeetham : "శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్".. గూస్బంప్స్ తెప్పిస్తోన్న 'జగమే సంగీతం' ట్రైలర్!
- Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు "కొత్త సినిమా"!**
డార్లింగ్ ఈవెంట్ లో హీరో నాని మాట్లాడుతూ ” ఈ డెకేడ్ లోనే నాకు నచ్చిన చిత్రం బలగం. బలగం చిత్ర ఫ్యాన్ గా, బలగం హీరో ఫ్యాన్ గా వచ్చాను, ఈ శుభసందర్భంలో నా ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమాలో నేను నిర్మించబోయే సినిమాలో ప్రియదర్శి హీరోగా చేయబోతున్నాడు. జగదీశ్ అనే కుర్రాడిని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాను” అని నాని అనౌన్సు చేసాడు. ఇలా వరుసగా పేరున్న బ్యానర్ లో సినెమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ మార్కెట్ ను ఏర్పరుచుకుంటున్నాడు ప్రియదర్శి. ఈ హీరో నటించిన డార్లింగ్ ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది
Also Read : Ram pothineni : డబుల్ ఇస్మార్ట్ కు..డబుల్ ఆఫర్..!
తాజావార్తలు
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!