ఒక్కప్పుడు నటినటులను ఎంతో గౌరవంగా చూసేవారు. వారికి సంబంధించిన విషయాలు కూడా బయటకు అసలు తెలిసేది కాదు.. ప్రేక్షకులు కూడా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. తోటి నటినటులను గౌరవించడం పక్కనపెడితే.. సీనియర్ యాక్టర్స్‌కి కనీసం రెస్పెప్ప్ ఇవ్వడంలేదు. ఇప్పటికే చాలా మంది సీనియర్ యాక్టర్స్ రీ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ వారిని అసలు గుర్తించడం లేదు. కాగా తాజాగా అలనాటి నటుడు పృథ్వీ కూడా తనకు జరిగిన అవమానాని పంచుకున్నాడు..
Also Read: Passion : శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘పేషన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..
రీసెంట్‌గా ఒక పాడ్ కాస్ట్ ప్రోగ్రాం లో పాల్గొన్న పృథ్వీ మాట్లాడుతూ.. ‘ 2024 లో రిలీజైన ‘ఉత్సవం’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి, వేరే సినిమాల షూటింగ్స్ నుంచి పర్మిషన్ తీసుకొని మరి వెళ్ళాను. అక్కడే ఉన్న దర్శక నిర్మాతలను పలకరిస్తే పట్టించుకోకపోతే, బిజీ గా ఉన్నారేమో అనుకున్నాను. కానీ స్టేజ్ ముందు వరుసలో కూర్చొని ఉంటే, వేరే వాళ్ళు వచ్చిన ప్రతి సారి పక్కకి జరగాలన్నారు. అలా జరుగుతూ జరుగుతూ అదే వరుసలో చివరికి వెళ్ళిపోయాను. చివరకు గ్రూప్ ఫోటో కోసం స్టేజ్ పైకి రమ్మంటే వెళ్ళాను. అక్కడ అనిల్ రావిపూడి తో మాట్లాడుతుంటే ఆయన్ని పక్కకి తీసుకెళ్లిపోయారు. సరే పోనీ అనుకుంటే ఆ తర్వాత గ్రూప్ ఫోటోలో నను వెనక్కి వెళ్లి నుంచోమంటే వెనక్కి వెళ్ళాను. నా పక్కనే గిరిబాబు గారు ఉన్నారు. ఆయన్ని ముందుకు తీసుకెళ్లి నుంచో పెట్టారు. ‘యానిమల్’ మూవీ తో పెద్ద స్టార్ అయిపోయానని అనుకున్నాను, కానీ ఎవరూ పట్టించుకోక పోయే సరికి ఎంతగానో బాధపడ్డా. ఆ అవమానం నా జీవితంలో మర్చిపోలేను. మాకు అవకాశాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రెస్పెక్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు.