Preethi Mukundan: ప్రీతి ముకుందన్ లేడీ ఓరిఎంటెడ్ మూవీ?

Priety Mukundan

Priety Mukundan

Preethi Mukundan: సౌత్ యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. తన అందం, అభినయంతో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే, నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ‘డాన్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న కొత్త సినిమాలో ఈమెకు నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ఈ మూవీ ద్వారా ఎజిల్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. కంప్లీట్‌గా ఫీమేల్ సెంట్రిక్ స్టోరీతో రాబోతున్న సినిమా కావడం విశేషం.

ఈ మూవీ కథ మొత్తం ప్రీతి ముకుందన్ చుట్టూనే తిరుగుతుందని, ఆమె నటనకు మంచి స్కోప్ ఉండే విధంగా సినిమాను దర్శకుడు తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఈ అమ్మడు ఈ పాత్రకు, కథకు పర్ఫెక్ట్‌గా న్యాయం చేస్తుందని, బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా దాదాపు రూ. 10 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ కథపై చర్చ నడుస్తోంది. అతి త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.