పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఇక అసలు విషయానికొస్తే… ప్రభాస్ ‘సలార్’లో ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ప్రభాస్ ను డ్యూయల్ రోల్స్ లో చూపించి ఆయన అభిమానులను థ్రిల్ చేయనున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కూడా ఈ విషయంలో ఉత్సాహంగా ఉన్నాడట. ఈ చిత్రంలో ప్రభాస్ స్టైల్, కావలసిన లుక్ ను రూపొందించడానికి ప్రత్యేక ప్రోస్తెటిక్, మేకప్ బృందాన్ని రంగంలోకి దించనున్నారట మేకర్స్. ఈ ఊహాగానాలు గనుక నిజమైతే ‘సలార్’పై భారీగా అంచనాలు పెరిగిపోతాయి. 2022లో విడుదల కానున్న భారీ సినిమాల్లో ‘సలార్’ కూడా ఒకటి. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.