Prabhas-Mahesh Babu: నమ్మొచ్చా.. ‘భైరవ-రుద్ర’ సేమ్ టు సేమ్ అట!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki-Varanasi: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరింత చాటి చెప్పేలా వస్తున్న రెండు భారీ ప్రాజెక్ట్స్ మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించగా, ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ రెండు సినిమాల్లోని హీరోల పాత్రలకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి’లో ప్రభాస్ భైరవ అనే బౌంటీ హంటర్ పాత్రలో కనిపించారు. మోడ్రన్ టెక్నాలజీ మరియు పురాణాలను మేళవించి చూపించిన ఈ పాత్ర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది.
Also Read: Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!
Also Read
- Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్.. 'న్యూటన్స్ థర్డ్ లా' ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
- Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
- OTT Trending Movie: టాప్ ట్రెండింగ్ లో100 కోట్ల సినిమా.. ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ కామెడీ..
- NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్‌పై గుడ్ న్యూస్!
అయితే, ఇప్పుడు వారణాసి సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్ర కూడా బౌంటీ హంటర్ తరహాలోనే ఉంటుందని, గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పాత్రకు త్రేతాయుగంలోని శ్రీరాముడి పాత్రకు లింక్ ఉంటుందని అంటున్నారు. కల్కిలో ప్రభాస్ భైరవ పాత్ర, ద్వాపర యుగంలోని కర్ణుడి పాత్రకు లింక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో.. ప్రభాస్-మహేష్ ఒకే తరహా పాత్రలు పోషిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాల కథా నేపథ్యం మాత్రం వేరే అయినప్పటికీ.. ఇద్దరు హీరోలు మాత్రం బౌంటీ హంటర్లే.. అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే.. వారి మూలాలు పురాణ పురుషులతో ముడిపడి ఉండటం విశేషం. అయితే, వారణాసిలో మహేష్ బాబు బౌంటీ హంటర్ అనే వార్తల్లో ఎంత వరకు నిజముందనేది ఇప్పుడే ఓ అంచనాకు రాలేము. అన్నట్టు.. వారణాసిలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మేకింగ్‌కు థియేటర్లో రాముడి ఎపిసోడ్‌కు గూస్బంప్స్ గ్యారెంటీ!
Also Read: Megastar: రామ్ చరణ్ కంటికి సర్జరీ.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
తాజావార్తలు
-
CM Chandrababu: మళ్లీ కూటమికి అధికారం ఖాయం.. కానీ..!
-
Lenovo Legion 27-1R: 27- ఇంచెస్ డిస్ప్లే, 280Hz రిఫ్రెష్ రేట్‌తో.. లెనోవో బడ్జెట్ గేమింగ్ మానిటర్ విడుదల.. ధర ఎంతంటే?
-
Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్.. ‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
Dharmendra Pradhan: షాకింగ్.. రెండు సార్లు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ..
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!