Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fauji vs Spirit Release Dates: ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల విడుదల విషయంలో ఆసక్తికర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వీటి రిలీజ్ డేట్లకు సంబంధించి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే సినిమాను తొందరపడి విడుదల చేయడం కంటే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించి, పక్కా ప్లానింగ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డార్లింగ్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఫౌజీ డిసెంబర్ రేసు నుంచి తప్పుకుంది.
ఫౌజీ విడుదల వాయిదా పడటంతో చిత్ర బృందానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత సమర్థంగా పూర్తి చేసుకునే అవకాశం లభించింది. సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, ఇతర సాంకేతిక పనులను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్న తర్వాతే విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఫౌజీ డిసెంబర్ రేసు నుంచి తప్పుకోవడంతో.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ ఆయన తదుపరి చిత్రంగా థియేటర్లలోకి రానుంది. స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
అయితే స్పిరిట్ రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అలాగే ఫౌజీకి కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఖరారవుతుందనే దానిపై కూడా స్పష్టత లేదు. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అసలు రిలీజ్ ఏంటనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫౌజీ విడుదల ఆలస్యం కావడంతో స్పిరిట్ ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరి ప్రభాస్ ముందుగా ఏ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తాడో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!