Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Look in Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో తనదైన మార్క్ చూపించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో.. స్పిరిట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ అప్డేట్ వైరల్‌గా మారింది.
స్పిరిట్‌లో సందీప్ రెడ్డి వంగా తన గత సినిమాల కంటే మరింత డార్క్, బోల్డ్ ట్రీట్మెంట్ను చూపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రణబీర్ కపూర్ మూవీ యానిమల్‌ను మించే స్థాయిలో కొన్ని సన్నివేశాలను డిజైన్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమాలోని కొన్ని బోల్డ్ సన్నివేశాలు కథలో కీలకంగా నిలిచే అవకాశం ఉందట. ఆ మధ్య విమల్ థియేటర్లో షూట్ చేసిన కొన్ని బోల్డ్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నాయని టాక్.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇప్పటివరకు కనిపించని సరికొత్త మాస్ అవతార్‌లో ప్రభాస్‌ను సందీప్ రెడ్డి స్పిరిట్‌లో చూపించబోతున్నారట. ముఖ్యంగా ప్రభాస్ బేర్ బాడీతో కనిపించే సన్నివేశాలు సినిమాలో ఉండబోతున్నాయనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం. సందీప్ రెడ్డి వంగా తన హీరోల పాత్రలను చాలా ఇంటెన్స్‌గా, డిఫరెంట్ షేడ్స్‌తో చూపింస్తుంటాడు. ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఆయన ఎలాంటి ప్రయోగం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్పిరిట్ విషయంలో కూడా హీరో పాత్ర, లుక్, ట్రీట్మెంట్పై దర్శకుడు ఎలాంటి రాజీ పడటం లేదనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ ద్వారా స్పిరిట్‌పై సందీప్ రెడ్డి బోల్డ్ హింట్స్ ఇచ్చేశాడు. దీంతో సినిమాలో ప్రభాస్‌ను సందీప్ ఏ రేంజ్లో ప్రెజెంట్ చేయబోతున్నారనే ప్రశ్న మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు సందీప్ స్టైల్ ఎలా జతకానుందనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న బోల్డ్ సీన్స్, బేర్ బాడీ లుక్ వంటి వివరాలకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి వీటిని ప్రస్తుతానికి సోషల్ మీడియా ప్రచారం, ఇండస్ట్రీ టాక్‌గానే చూడాలి. మరి సందీప్–ప్రభాస్ కాంబినేషన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!