Prabhas : రికార్డు ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్…
- డార్లింగ్ లేటేస్ట్ సినిమా 'ది రాజాసాబ్'
- భారీ ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్
- నైజాం రైట్స్ దక్కించుకున్న మైత్రీ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.
Also Read : Allu Arjun : హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..
Also Read
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చక చక ఫినిష్ చేస్తున్నాడు దర్శకుడు మారుతీ. త్వరగా షూట్ ఫినిష్ చేసి VFX వర్క్ పర్ఫెక్ట్ గా వచ్చేలా ఎక్కువ టైమ్ వాటికీ కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా రాజా సాబ్ బిజినెస్ కు మాంచి గిరాకీ ఏర్పడింది. తాజగా రాజాసాబ్ ఆడియో రైట్స్ డీల్ క్లోజ్ చేసారు మేకర్స్. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ అటుఇటుగా రూ. 25 కోట్లకు ఆడియో రైట్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ రోజు సాయంత్రం 4:05 కు ఈ చిత్రంలోని గళ్ళ కోటు, నల్ల ఫ్యాంటు, టీ షర్ట్ ధరించిన ప్రభాస్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరోవైపు రాజాసాబ్ నైజాం థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ బడా డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది. అత్యంత భారీ బడ్జెట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తుండగా యస్ యస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్
తాజావార్తలు
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..