Site icon NTV Telugu

Anupam Kher : గోడ దూకి షూట్ కి వెళ్లిన అనుపం ఖేర్

Anupam Kher

Anupam Kher

ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టేందుకు అనుపం ఖేర్ గోడ దూకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా నటిస్తున్న, ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి
దీన్ని ఫౌజి అని సంబోధిస్తున్నారు.

Also Read : Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

అయితే, అనుపం ఖేర్ ఈ సినిమా షూటింగ్ కోసం తన కారులో హోటల్ నుంచి లొకేషన్‌కు వెళ్లారు. అయితే, డ్రైవర్‌కు సరిగ్గా రూట్ తెలియకపోవడంతో, షూట్ జరుగుతున్న అల్యూమినియం ఫ్యాక్టరీలోని మరో రూట్‌లో తీసుకెళ్లాడు. అక్కడ డెడ్ ఎండ్ ఉండడంతో కార్ రివర్స్ చేయడం ఇబ్బందిగా మారింది.

Also Read : Bengaluru: వివాహేతర సంబంధం.. భార్య తల నరికి, తలతో పోలీస్‌ స్టేషన్‌కు..

ఆ పక్కనే గోడ ఉండడం, గోడ పక్కనే షూట్ జరుగుతూ ఉండడంతో, యూనిట్ సభ్యులు గమనించి రెండు నిచ్చెనలు తీసుకొచ్చి ఆయనను ఒక వైపు నుంచి మరో వైపు తరలించారు. ఈ విషయాన్ని అనుపం ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తన 40 ఏళ్ల సినిమా జర్నీలో సినీ షూటింగ్ లొకేషన్స్‌కు ఎన్నో రకాలుగా వెళ్లానని, కానీ ఇది మాత్రం యూనిక్ అని చెప్పుకొచ్చారు.

Exit mobile version