Green Chilli Plant: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే పచ్చిమిర్చి సాగు.. 2 నెలల్లో కాయలు గ్యారంటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Green Chilli Plant: ఇకపై మీ వంటింట్లో పచ్చిమిర్చి అయిపోతే వెంటనే మార్కెట్‌కు పరుగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంట్లోనే చిన్న కుండీలో పచ్చిమిర్చి మొక్కను సింపుల్‌గా పెంచుకోవచ్చు. దీని కోసం మీరు మార్కెట్ నుంచి ప్రత్యేకంగా విత్తనాలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లో ఉన్న పండిన పచ్చిమిర్చి నుంచే విత్తనాలు తీసుకుని పచ్చి మొక్కలు పెంచొచ్చు. సరైన పద్ధతిలో పెంచితే రెండు నెలల్లోనే మీ ఇంటి కుండీ నుంచి కారం కారం పచ్చిమిర్చిని కోసుకోవచ్చు. మీ ఇంట్లో పచ్చి మిర్చి సాగును సింపుల్‌గా ఎలా చేయాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
ముందుగా మీరు మిర్చి మొక్క వేర్లు విస్తరించేందుకు సరిపడా స్థలం ఉన్న కుండీ లేదా గ్రో బ్యాగ్‌ను పచ్చి మిర్చి సాగుకు ఎంచుకోవాలి. సాధారణ మట్టిలో బాగా కుళ్లిన సేంద్రియ ఎరువు లేదా పశువుల ఎరువు కలిపితే మొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా కుండీలో నీరు నిల్వ ఉండకుండా అడుగున డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న పండిన పచ్చిమిర్చి నుంచి విత్తనాలను తీసుకోవాలి. అయితే వాటిని నాటడానికి ముందుగా బాగా ఆరబెట్టాలి. అనంతరం విత్తనాలను నీటిలో నానబెట్టి సుమారు రెండు రోజుల తర్వాత నాటుకోవాలి. ఇంట్లో తొలిసారి కూరగాయలు పెంచేవారికి ఈ పద్ధతి సింపుల్‌గా ఉంటుంది.
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
విత్తనాలు నాటేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ముందుగా సిద్ధం చేసుకున్న మట్టిలో ఈ విత్తనాలను నాటాలి. మరీ లోతుగా పాతిపెట్టకుండా సుమారు 2 నుంచి 3 అంగుళాల లోతులోనే ఈ విత్తనాలను వేయాలి. విత్తనాలు వేసిన తర్వాత మట్టి తేమగా ఉండేలా నీరు పోయాలి. అయితే కుండీలో నీరు ఎక్కువగా నిలిచిపోకుండా జాగ్రత్త పడాలి. అధిక తేమ వల్ల విత్తనాలు, మొక్క వేర్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మిర్చి మొక్క ఎదుగుదలకు సూర్యరశ్మి చాలా ముఖ్యం. రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల పాటు నేరుగా లేదా తగినంత వెలుతురు అందే ప్రదేశంలో ఈ కుండీని ఉంచాలి. బాల్కనీ, టెర్రస్ లేదా మంచి వెలుతురు వచ్చే కిటికీ దగ్గర ఈ కుండీని పెట్టుకోవాలి. సరైన తేమ, సూర్యరశ్మి లభిస్తే కొన్ని వారాల్లోనే విత్తనాల నుంచి మొలకలు రావడం ప్రారంభమవుతుంది.
ఒకే కుండీలో ఎక్కువ మొక్కలు వద్దు
విత్తనాలు మొలకెత్తిన తర్వాత సుమారు 3 నుంచి 4 వారాల్లో మొక్కలు పెరుగుతాయి. ఒకే కుండీలో ఎక్కువ మొక్కలు ఉంచకుండా చూసుకోవాలి. నాలుగు కంటే ఎక్కువ మొక్కలు ఉంటే వాటికి తగినంత స్థలం, పోషకాలు అందక ఎదుగుదల మందగించే అవకాశం ఉంటుంది. సరైన సంరక్షణ అందిస్తే సుమారు 30 నుంచి 40 రోజుల్లో మిర్చి మొక్కలకు చిన్న తెల్లని పువ్వులు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ పువ్వుల తర్వాత క్రమంగా పచ్చిమిర్చి కాయలుగా ఏర్పడతాయి. ఇలా క్రమం తప్పకుండా నీరు, సూర్యరశ్మి, అవసరమైన పోషకాలు అందిస్తూ మొక్కను చూసుకుంటే సుమారు రెండు నెలల్లో ఇంట్లోనే పండించిన తాజా పచ్చిమిర్చిని కోయవచ్చు. పెద్ద స్థలం లేకపోయినా బాల్కనీ, టెర్రస్ లేదా మంచి సూర్యరశ్మి వచ్చే కిటికీ దగ్గర ఒక కుండీతోనే ఈ కిచెన్ గార్డెనింగ్‌ను స్టార్ట్ చేయండి.
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?