Sapthami: నితిన్ గాయం వల్ల షూటింగ్ ఆలస్యం..హార్స్ రైడింగ్ తో ఇబ్బంది!
- నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న "తమ్ముడు"
- తన ఎక్స్పీరియన్స్ తెలిపిన హీరోయిన్ సప్తమి గౌడ
- లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న “తమ్ముడు” చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు రత్న క్యారెక్టర్ లో నటించిన తన ఎక్స్పీరియన్స్ తెలిపారు హీరోయిన్ సప్తమి గౌడ.
నితిన్ భుజానికి గాయం వల్ల షూటింగ్ ఆలస్యం
– కాంతార సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు దగ్గర నుంచి “తమ్ముడు” మూవీ కోసం కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది. హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అరకులో షూటింగ్ చేశాం. నితిన్ భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. “తమ్ముడు” మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.
Also Read
- Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
హార్స్ రైడింగ్ తో ఇబ్బందిపడ్డా
– అంబర గొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. నాను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ క్యారెక్టర్ గా చూస్తే పూర్తిగా భిన్నమైనది. “తమ్ముడు” కాస్త సీరియస్ సబ్జెక్ట్..ఇందులో నా క్యారెక్టర్ ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా వారితో నా తరహాలో జోవియల్ గా ఉంటాను. అది ఆడియెన్స్ కు హ్యూమర్ ఇస్తుంది. రత్న రేడియో జాకీ కాదు. తను పాత్ర ఎలా ఉంటుందో మూవీలో చూడాలి. కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.
రిలీజ్ లోపు పవన్ తమ్ముడు మూవీ చూస్తా
– పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా గురించి నాకు ఐడియా ఉంది. వేణు చెప్పారు. ఆ సినిమాతో పవన్ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారో మనందరికీ తెలుసు. నేను కంప్లీట్ మూవీ చూడలేదు. మా మూవీ రిలీజ్ లోపు పవన్ తమ్ముడు మూవీ చూస్తాను.
ఫస్ట్ ఆర్టిస్ట్ నేనే
– “తమ్ముడు” సినిమా నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న క్యారెక్టర్ రాసేప్పుడు మిగతా వాటి కంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.
మహిళా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీలవుతారు
– “తమ్ముడు”లో నేను, లయ, దిత్య, వర్ష, స్వసిక..ఇలా మా అందరి క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. మా ఐదు వుమెన్ క్యారెక్టర్స్ డిఫరెంట్ గా, పవర్ ఫుల్ గా ఉంటాయి. గుత్తి క్యారెక్టర్ చూస్తే బస్ డ్రైవ్ చేస్తుంది. తను బస్ డ్రైవింగ్ ఈ మూవీ కోసం నేర్చుకుంది. లయ స్ట్రిక్ట్ ఆఫీసర్ గా కనిపిస్తారు. నేను, వర్ష..ఇలా మా అందరికీ ఫైట్ సీక్వెన్స్ లు ఉంటాయి. సినిమాల్లో హీరోతో సాంగ్స్ పాడే హీరోయిన్ క్యారెక్టర్స్ చూస్తుంటాం. కానీ ఇందులో ఫైట్ చేసే హీరోయిన్స్ ను చూస్తారు. వుమెన్ క్యారెక్టర్స్ ను ఇంత బలంగా తెరకెక్కించినందుకు రేపు థియేటర్స్ లో “తమ్ముడు” సినిమా చూసే మహిళా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీలవుతారు.
పక్కాగా డిజైన్ చేసుకున్నారు
– ఈ మూవీలో నితిన్ తో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణితి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దిల్ రాజు ఎస్వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా బాగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలంటే మంచి సంస్థలకే సాధ్యమవుతుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు “తమ్ముడు” మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్ ను పక్కాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ నుంచి కూడా తనకు కావాల్సిన ఔట్ పుట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు.
ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు
– బిగ్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం “తమ్ముడు” మూవీని చూడండి. మీరు ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ చూస్తే సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో తెలుస్తుంది. ఇంట్లో ఇలాంటి సినిమా చూస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. థియేటర్ లోనే “తమ్ముడు” చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తా
– నాకు కమర్షియల్ మూవీస్ చేయడం ఇష్టమే. “తమ్ముడు” కూడా కమర్షియల్ మూవీనే. పుష్ప లో రశ్మిక చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. అలాంటి ఆఫర్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కాంతార సక్సెస్ తర్వాత నాకు అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాల్లో మీకు నేను కనిపించకపోవడానికి కారణమదే. డిఫరెంట్ రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా. ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతో పాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా. వాటి డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తా. భాషాలకు అతీతంగా అన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్‌ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!