ప్రభాస్ లైనప్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఖాతాలో అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో మారుతితో ‘రాజా సాబ్’.. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా సెట్స్ పై ఉండగా. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డి తో ‘స్పిరిట్’ చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయ్యాక త నాగ్ అశ్విన్ తో కల్కి – 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్స్ లన్నింటిలో సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సందీప్ ఏ జానర్‌లో తెరకెక్కిస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : Puri-Vijay : ‘బెగ్గర్’ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి
అయితే ప్రభాస్‌కి జోడీగా దీపిక పదుకొనే నటిస్తోంది అని ఇప్పటికే పలు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆమె డిమాండ్లు కళ్లు భైర్లు కమ్మేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. సందీప్ వంగా దీపికని సంప్రదించగా, ఆమె భారీ పారితోషికంతో పాటు, పెద్ద మొత్తంలో షేర్‌ని డిమాండ్ చేసిందట, పైగా 8 గంటలు మాత్రమే పనికి కేటాయిస్తానని కండీషన్స్ కూడా పెట్టిందని సమాచారం. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ఇచ్చిన ఎనిమిది గంటలలో రెండు గంటలు జర్నీకే సరిపోతే మిగిలిన ఆరు గంటలు మాత్రమే సెట్స్‌లో ఉంటుందట. ఇక దీపిక కండీషన్స్‌కి బాగా హర్ట్ అయిన సందీప్ రెడ్డి వంగా కొత్త హీరోయిన్‌ని వెతికే పనిలో ఉన్నాడట. దీపిక ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెతో ఎక్కువ సమయం గడపాలని ఆమె టైం విషయంలో అంత స్ట్రిక్ట్‌గా కండీషన్స్ పెడుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం దీపికకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలలో వాస్తవం ఏంటన్నది తెలియాల్సి ఉంది.