Prabhas-PVCU: ‘బ్రహ్మరాక్షస్’ కోసం ఊహించని క్యామియో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో స్టార్ హీరోలు కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘హను-మాన్’ సినిమాతో మొదలైన ఈ యూనివర్స్‌లో.. ఇప్పటికే ‘జై హను-మాన్’తో రిషబ్ శెట్టి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా అడుగుపెట్టబోతున్నాడనే న్యూస్ వినిపిస్తోంది. వాస్తవానికి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ‘బ్రహ్మరాక్షస్’ అనే సినిమా చేయబోతున్నట్టుగా టాక్ ఉంది. అయితే, ఇప్పుడు ‘బ్రహ్మరాక్షస్’ కాస్త ముందే థియేటర్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ పూర్తిస్థాయిలో ‘బ్రహ్మరాక్షస్’ సినిమా చేయకముందే, ఈ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ప్రశాంత్ వర్మ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడట.
Also Read: Prabhas-Mahesh Babu: నమ్మొచ్చా.. ‘భైరవ-రుద్ర’ సేమ్ టు సేమ్ అట!?
Also Read
ప్రస్తుతం PVCUలో భాగంగా ‘మహాకాళి’ అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఫీమేల్ సూపర్ హీరో ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే ప్రశాంత్ వర్మ అందిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ ‘మహాకాళి’ చిత్రంలోనే ప్రభాస్ ఒక చిన్న కామియోలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారానే ‘బ్రహ్మరాక్షస్’ను ఇంట్రడ్యూస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆ పాత్రకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ప్రభాస్ ‘బ్రహ్మారక్షస్’ సినిమా చేసే ఛాన్స్ ఉంది. క్లిక్ అయితే మత్రం ‘బ్రహ్మరాక్షస్’ పై అంచనాలను మరింతగా పెంచనుంది. బ్రహ్మరాక్షస్ పాత్ర నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక శక్తివంతమైన రోల్ అని, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది ఒక కీలక మలుపుగా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. అయితే, అసలు బ్రహ్మరాక్షస్ ప్రాజక్ట్ ఉండదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంటే, ‘మహాకాళి’లో ప్రభాస్ క్యామియో గురించి వార్తలు వస్తుండడం గమనార్హం.
Also Read: Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!