Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లో బాడీ డబుల్ వాడుతున్నారనే చర్చ మరోసారి మొదలైంది. గత కొంతకాలంగా ప్రభాస్ యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లోనూ బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. సాధారణంగా హీరోలు యాక్షన్, ఫైట్ సన్నివేశాల్లో డూప్‌లను ఉపయోగించడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. హీరోను పోలిన ఫైటర్‌తో ఫేస్ కనిపించకుండా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు. ప్రస్తుతం దీనినే బాడీ డబుల్‌గా పిలుస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాల్లో ఫైట్స్ మాత్రమే కాకుండా కొన్ని సాధారణ సన్నివేశాల్లోనూ బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ప్రభాస్‌కు గతంలో మోకాలి సమస్యలు, సర్జరీలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ సమయంలోనూ ఆయన కొంత ఇబ్బందిగా నడిచిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో యాక్షన్, రన్నింగ్ వంటి సన్నివేశాల్లో బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నారనే చర్చ మొదలైంది.
గతంలో మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’లో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన బాడీ డబుల్ అంశంపై మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఒక సన్నివేశంలో హీరో స్వయంగా నటించాడా? డూప్‌తో చిత్రీకరించారా? అనేది కాకుండా.. ఆ సీన్ తెరపై ఎలా వచ్చింది, పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేదే ప్రేక్షకులకు ముఖ్యమని మంచు విష్ణు వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘కన్నప్ప’లో ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను బాడీ డబుల్‌తో చిత్రీకరించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన మాత్రం లేదు. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాడీ డబుల్ వాడుతున్నారా అని చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డిని ప్రశ్నించగా.. ఒక్క షాట్లో కూడా బాడీ డబుల్‌ను ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా ప్రారంభానికి ముందే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ‘స్పిరిట్’లో ప్రభాస్‌కు బాడీ డబుల్ ఉండదని చెప్పారని ఆయన గుర్తు చేశారు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్‌ను పూర్తి స్థాయిలో తెరపై చూడొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ సినిమాల్లో బాడీ డబుల్ వినియోగంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి.. ‘స్పిరిట్’ విషయంలో నిర్మాత ఇచ్చిన క్లారిటీతో కొంతవరకు చెక్ పడినట్లైంది. అయితే ‘కన్నప్ప’లో ప్రభాస్ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించి మాత్రం అధికారికంగా ఎలాంటి వివరాలు వెలువడలేదు. దీంతో ఈ అంశంపై అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది.
Also Read
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
- Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
తాజావార్తలు
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!