ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్య వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మరణించారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కమెడియన్ మృతి చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన హాస్యనటుడు బ్యాంకు జనార్దన్ తాజాగా మృతి చెందారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. మొదట ఆరోగ్య సమస్యలతో బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కొంత కోలుకుంటున్నట్లు కనిపించిన.. చివరకు చికిత్స సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసి నటినటులు, కన్నడ సినీ అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని వేడుకుంటున్నారు.
Also Read: Tamannaah : కంటెంట్ బాగుంటే చాలు..
1948లో జన్మించిన ఆయన తొలుత బ్యాంకులో పని చేసేవాడు. కానీ నాటక, చిత్ర రంగం పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. అందుకే అతని బ్యాంక్ జనార్దన్ అని పిలుస్తారు. ఇక బ్యాంక్ జనార్దన్ కన్నడ నటుడే అయినప్పటికి అని భాషలో 500కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఖననం, రిదం, లాస్ట్ పెగ్, ఉపేంద్ర 2 తదితర సినిమాలు చేశారు.