తమన్నా.. ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటికి కూడా అంతే ఫామ్ లో దూసుకుపోతుంది. హీరోయిన్‌ల కెరీర్ కాలం చాలా తక్కువ. అందుకే తమన్నా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా, చివరకు స్కిన్ షో కూడా పెంచి ప్రజంట్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ అమ్మడు పేరు బాగా వినపడుతుంది. అక్కడ స్పెషల్ సాంగ్స్, మూవీస్, సరిస్ అంటూ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ‘ఓదెల2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తమన్నా.
Also Read: Alia : అలియా నిర్మాణంలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరి..
అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీ తో కూడిన పాత్రలో కనిపించనుంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ ట్రైలర్ తో అంచనాలని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిన ఈ మూవి ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది తమన్నా. అయితే తాజాగా తమన్నాకి ‘ఆఫర్లు లేకపోవడంతో చిన్న సినిమాల్లో నటిస్తున్నారా?’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు తమన్నా స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. ‘ మీరు అనే మాట చాలా వ్రాంగ్ ఎందుకంటే.. నా దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. కంటెంట్ బాగుంటే అది పెద్ద సినిమా అవుతుంది. బాగోకపోతే పెద్ద సినిమా కూడా చిన్న సినిమా అవుతుంది. కెరీర్ ప్రారంభంలో నేను నటించిన ‘హ్యాపీడేస్’ మూవీలో ఎనిమిది ప్రధాన పాత్రల్లో నేనొకదాన్ని. నాకు డ్యాన్స్ ఇష్టం కాబట్టి బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’లో స్పెషల్ సాంగ్‌లో నటించాను. కానీ, అది పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. అందుకే ప్రేక్షకులను ఏది ఆకట్టుకుంటుందని మనం చెప్పలేం’ అని తమన్నా సమాధానం ఇచ్చింది.